Kathi Mahesh: కత్తి మహేశ్ అరెస్ట్.. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యల ఫలితం!

  • కత్తిపై నాలుగు కేసులు
  • ఇంటికెళ్లి అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • నేడు రిమాండుకు

హిందూ దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా మాట్లాడిన కత్తి మహేశ్ హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

దీంతో హిందూ సంఘాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. కత్తి వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మహేశ్‌ను సోమవారం రాత్రి ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ రోజు ఆయనను రిమాండ్‌కు తరలించనున్నారు. కత్తిపై వివిధ స్టేషన్లలో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి.

Kathi Mahesh
Tollywood
Lord Sri Ram
Police
Arrest
  • Loading...

More Telugu News