raghuveera reddy: నెఫ్రాలజిస్టులు లేరు.. డయాలసిస్‌ సౌకర్యం లేదు!: రఘువీరారెడ్డి విమర్శ

  • రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి
  • గ్రామాలకు గ్రామాలే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నాయి
  • కిడ్నీ బాధితులకు సురక్షితమైన తాగునీరు అందించాలి
  • డయాలసిస్‌ అందుబాటులోకి తీసుకురావాలి

రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈరోజు కృష్ణా జిల్లా తిరువూరు నియోజక వర్గం ఎ.కొండూరు మండలంలో ఆయన పర్యటించారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ రతన్‌ ఆధ్వర్యంలో తమ పార్టీ సీనియర్‌ నేతలతో కలిసి రఘువీరారెడ్డి కిడ్నీ బాధితులను పరామర్శించారు.

దీపలానగర్‌, మాన్సింగ్‌ తండాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కిడ్నీ బాధితులను కలిసి వారు ఎదుర్కుంటోన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ... గ్రామాలకు గ్రామాలే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నాయని అన్నారు. తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరులోనూ తాము పర్యటించామని తెలిపారు.

తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో 14 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ఐదుగురు మాత్రమే ఉన్నారని అన్నారు. వారిలోనూ ఇద్దరు మాత్రమే రెగ్యులర్‌ వైద్యులని చెప్పారు. కిడ్నీ బాధితులకు పౌష్టికాహారం, సురక్షితమైన తాగునీరు అందించాలని, డయాలసిస్‌ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చాలా ప్రాంతాల్లో నెఫ్రాలజిస్టులు లేరు.. డయాలసిస్‌ సౌకర్యం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News