sports: అరుదైన గౌర‌వాన్ని పొందిన రాహుల్ ద్రావిడ్‌!

  • ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్‌' లో చోటు సంపాదించిన ఐదో భార‌త ఆట‌గాడు
  • రాహుల్ తో పాటు రికీ పాంటింగ్‌, ఇంగ్లాండ్ మ‌హిళా క్రికెటర్ కి చోటు
  • సంతోషం వ్యక్తం చేసిన రాహుల్

అండర్-19 కోచ్ గా అద్భుతాలు సృష్టిస్తున్న భార‌త మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్‌ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో ద్రావిడ్‌ స్థానం దక్కించుకున్నట్లు ఐసీసీ అధికారులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

 రాహుల్ తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌, ఇంగ్లాండ్ మ‌హిళా జ‌ట్టు మాజీ వికెట్ కీప‌ర్ క్ల‌యిర్ టైల‌ర్‌ కు ఈ అరుదైన గౌర‌వాన్ని కల్పించారు. దీంతో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌ లో చోటు ద‌క్కించుకున్న ఐదో భార‌త ఆట‌గాడిగా ద్రావిడ్‌ నిలిచాడు. ద్రావిడ్‌ కంటే ముందు బిష‌న్ సింగ్ బేడీ, సునీల్ గ‌వాస్క‌ర్‌, క‌పిల్ దేవ్‌, అనిల్ కుంబ్లేలు ఈ గౌర‌వాన్ని పొందారు. మొత్తం 164 టెస్టులు, 344 వన్డేలు ఆడిన రాహుల్.. హాల్ ఆఫ్ ఫేమ్‌ లో చోటు ద‌క్క‌డంపై సంతోషాన్నివ్య‌క్తం చేశాడు.

  • Loading...

More Telugu News