south korea: ఈ నెల 8 నుంచి భారత్‌లో ద.కొరియా అధ్యక్షుడి పర్యటన

  • భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు రాక
  • ఈ నెల 11 వరకు భారత్‌లో పర్యటన
  • ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంపై చర్చలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ ఈ నెల 8 నుంచి 11 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు కొరియా అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్ పర్యటన తరువాత మూన్‌ జే ఇన్‌ సింగపూర్‌ పర్యటనకు వెళతారని తెలిపింది.

భారత పర్యటనలో ఆయన.. మోదీతో సమావేశం అవుతారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారం, కొరియా ద్వీపంలో శాంతి, సుసంపన్నతలపై చర్చలు జరుగుతాయి. అలాగే ఆసియా దేశాలతో పరస్పర సహాయ సహకారాలపై కూడా చర్చిస్తారు. రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ను కూడా మూన్‌ జే ఇన్‌ కలవనున్నారు.        

south korea
Narendra Modi
India
  • Loading...

More Telugu News