R.Thyagarajan: ప్రముఖ తమిళ దర్శక నిర్మాత త్యాగరాజన్ మృతి

  • రజనీ, కమలహాసన్ లాంటి స్టార్లతో సినిమాలు తీసిన త్యాగరాజన్
  • చెన్నైలో గుండెపోటుతో మృతి
  • సంతాపం ప్రకటించిన సినీ ప్రముఖులు

ప్రముఖ సినీ దర్శకనిర్మాత ఆర్.త్యాగరాజన్ తుదిశ్వాస విడిచారు. చెన్నై వలసరవాక్కంలోని స్వగృహంలో నిన్న ఉదయం గుండెపోటుకు గురై ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. రజనీకాంత్, కమలహాసన్ వంటి అగ్రనటులతో కూడా ఆయన సినిమాలు నిర్మించారు. ఎంజీఆర్ హీరోగా పలు హిట్ చిత్రాలను నిర్మించిన చిన్నప్ప దేవర్ అల్లుడైన త్యాగరాజన్ తొలుత నిర్మాతగా వ్యవహరించారు. అనంతరం దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 35 చిత్రాలను దర్శకుడిగా ఆయన తెరకెక్కించారు. త్యాగరాజన్ కు భార్య సుబ్బులక్ష్మి (70), ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

R.Thyagarajan
director
died
kollywood
  • Loading...

More Telugu News