Vinod Kambli: తనను అసభ్యకరంగా తాకిన బాలీవుడ్ సింగర్ తండ్రిని బాదేసిన వినోద్ కాంబ్లీ భార్య!

  • ముంబైలోని ఇనార్బిట్ మాల్ లో ఘటన
  • ఆండ్రియాను అసభ్యంగా తాకిన రాజేంద్ర తివారీ
  • తన చేతిలోని హ్యాండ్ బ్యాగ్ తో కొట్టిన ఆండ్రియా

ఓ మాల్ లో షాపింగ్ కు వెళ్లిన తనతో బాలీవుడ్ గాయకుడు అంకిత్ తివారీ తండ్రి రాజేంద్ర తివారీ (59) అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ, అతనిపై దాడికి దిగింది మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా. ముంబైలోని ఇనార్బిట్ మాల్ లో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కాంబ్లీ, రాజేంద్ర తివారీతో వాగ్వాదానికి దిగగా, ఆండ్రియా తన చేతిలోని బ్యాగ్ తో రాజేంద్రను బలంగా బాదుతూ కనిపించింది. ఆ సమయంలో రాజేంద్రతో పాటు అంకిత్, అతని సోదరుడు అంకుర్ కూడా అక్కడే ఉన్నారు. ఒకసారి తనను తగిలితే ఊరుకున్నానని, పదేపదే తాకరాని చోట ఆయన తాకుతున్నాడని ఆండ్రియా ఆరోపించగా, కాంబ్లీ ఆ ముగ్గురితో గొడవకు దిగాడు.

ఈ దృశ్యాలన్నీ అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంబ్లీ, మాల్ లోని గేమ్ జోన్ వద్ద తామున్న సమయంలో ఆ వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఆపై కాసేపటికి తాము ఫుడ్ కోర్టు వద్దకు వెళ్లగా, రాజేంద్ర అతని ఇద్దరు కుమారులతో వచ్చి తమపై దాడికి దిగారని, దూరంగా ఉండాలని తాను హెచ్చరిస్తే, "మీరెవరో మాకు తెలియదు" అంటూ రెచ్చిపోయారని ఫిర్యాదు చేశాడు. కాగా, తివారీలు సైతం అకారణంగా కాంబ్లీ దంపతులు తమపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

  • Error fetching data: Network response was not ok

More Telugu News