Rajya Sabha: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా మాజీ ప్రధాని కుమారుడు?

  • ఐకే గుజ్రాల్ కుమారుడు నరేష్ గుజ్రాల్ కు అవకాశం
  • త్వరలో జరగనున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు
  • శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన నరేష్

త్వరలో జరగనున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలకు ఎన్డీయే తరఫున శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన నరేష్ గుజ్రాల్ ను బీజేపీ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. పీజే కురియన్ పదవీ విరమణ తరువాత ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు తమకు తగినంత బలం లేదని భావిస్తున్న బీజేపీ, ఓ మిత్ర పక్షానికి చెందిన అభ్యర్థిని పోటీలో నిలిపితే, ఇతర పార్టీల నుంచి మద్దతు లభిస్తుందన్న ఆలోచనతోనే నరేష్ గుజ్రాల్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ కుమారుడిగా ఆయన ఉండటం తమకు లాభించే అంశమని బీజేపీ అధిష్ఠానం అంచనా వేస్తోంది. 1948, మే 19న జలంధర్ లో జన్మించిన నరేష్ గుజ్రాల్, పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Rajya Sabha
Naresh Gujral
Deputy Chairman
BJP
SAD
  • Loading...

More Telugu News