Tirumala: తిరుమల పోలీసు రెస్ట్ హౌస్ ముందు మాంసం... కలకలం!

  • రోడ్డుపై పారేసిన గుర్తు తెలియని వ్యక్తులు
  • కంగుతిన్న భక్తులు
  • విచారణ ప్రారంభించిన పోలీసులు

పవిత్ర తిరుమలలో అపచారం జరిగింది. మద్య, మాంసాలు, పొగాకు ఉత్పత్తులపై నిషేధం ఉన్న తిరుమలలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి కోడి మాంసాన్ని తీసుకు వచ్చారు. దాన్ని రోడ్డుపై పారేయడంతో భక్తులు కంగుతిన్నారు. తిరుమలలో సెక్యూరిటీ విధులు నిర్వహించే భద్రతా సిబ్బంది విశ్రాంతి తీసుకునే గరుడ పోలీసు రెస్ట్ హౌస్ ముందు రహదారిపై ఈ మాంసం పడివుంది.

స్థానికంగా నివాసం ఉండేవారు దీన్ని తెచ్చారా? ఎవరైనా భద్రతా సిబ్బంది తెచ్చారా? అన్న విషయమై సమాచారం లేకపోవడంతో పోలీసులు దీన్ని ఎవరు తీసుకు వచ్చారన్న విషయమై దర్యాఫ్తు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, హుటాహుటిన అక్కడికి వచ్చి మాంసం ముక్కలను తీసివేయించారు. అలిపిరిలో తనిఖీలను చేసే సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు.

Tirumala
Tirupati
Chicken
Police Rest House
  • Loading...

More Telugu News