China: 'అన్ లిమిటెడ్ ఆఫర్' ప్రకటించి... తట్టుకోలేక హోటల్ ను మూసేసుకున్న ఆసామి!
- కస్టమర్ల కోసం ఆఫర్ ప్రకటించిన బీజింగ్ రెస్టారెంట్
- వచ్చిన వారి ధాటికి తట్టుకోలేకపోయిన యజమాని
- హోటల్ ను మూసేస్తున్నట్టు ప్రకటన
తమ హోటల్ లేదా రెస్టారెంట్ కు కస్టమర్లు ఎగబడి రావాలన్న ఆలోచనతో ఎన్నో రకాల ఆఫర్లను యజమానులు ప్రకటిస్తుంటారు. కానీ, బీజింగ్ సమీపంలో 'జియా మెర్నర్' పేరిట రెస్టారెంట్ ను ప్రారంభించిన ఓ ఆసామి మాత్రం చేదు అనుభవాన్ని ఎదురుచూడాల్సి వచ్చింది. కస్టమర్లను అధికంగా రప్పించేందుకు రూ. 1300కు 'అన్ లిమిటెడ్ ఫుడ్' అని ఓ ఆఫర్ ను ఆయన ప్రకటించాడు.
దీని గురించి తెలుసుకున్న ఆహార ప్రియులు లొట్టలేసుకుంటూ వచ్చి హోటల్ ముందు క్యూ కట్టగా సంబరపడిపోయాడు. కానీ ఆ ఆనందం మూన్నాళ్ల ముచ్చటే అయింది. వచ్చిన వారంతా తిన్నంత తిని, స్వయంగా పార్శిల్ చేసుకుని వెళ్లడం ప్రారంభించారట. దీంతో నష్టాలు ప్రారంభం కావడంతో చేసేదేమీ లేక, రెస్టారెంట్ ను మూసేస్తున్నట్టు ప్రకటించాడు.