New Delhi: 11 మంది సామూహిక ఆత్మహత్య... క్షుద్రపూజలతో మోక్షం కోసమే!

  • న్యూఢిల్లీలో కలకలం రేపిన ఘటన
  • ఇంట్లో క్షుద్రపూజలకు సంబంధించిన రాతలు
  • మరింత లోతుగా విచారిస్తున్న పోలీసులు

దేశ రాజధాని న్యూఢిల్లీలో నిన్న వెలుగులోకి వచ్చి కలకలం రేపిన సామూహిక ఆత్మహత్యల వెనుక కారణాన్ని కనుగొనే క్రమంలో పోలీసులు పలు ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చారు. మొత్తం 11 మృతదేహాలు ఇంట్లో కనిపించగా, ఆ ఇంట్లో సోదాలు జరిపిన అనంతరం, పోలీసులకు కొన్ని పుస్తకాల్లో క్షుద్ర పూజలు, మోక్షం పొందేందుకు ఉన్న మార్గాల గురించిన వివరాలు ఉన్నాయి.

 ఎలా మరణిస్తే మోక్షం లభిస్తుందన్న విషయాలు రాసుండటాన్ని చూసి, అందులో చెప్పిన విధంగానే మృతదేహాలు ఉండటంతో, వీరి ఆత్మహత్యకు అదే కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రతి మృతదేహం కళ్లకు గంతలుకట్టి ఉండటం, నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసి ఉండటంతో, తొలుత ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్యలుగా భావించినప్పటికీ, కుటుంబంలోని ఓ వ్యక్తి అందరికీ ఆత్మహత్య చేసుకునేందుకు సాయపడి, ఆపై తను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఆ ఇంట్లో కొన్ని క్షుద్ర పూజలు జరిగినట్టు ఆధారాలు లభించాయని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత మృతికి అసలు కారణాలు తెలుస్తాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

New Delhi
Occult
Sucide
  • Loading...

More Telugu News