Drunk Driving: 454 మంది మందుబాబులకు జైలు శిక్ష.. గరిష్టంగా నెల రోజుల శిక్ష!

  • జూన్ లో 2,735 కేసులు నమోదు
  • 101 మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు
  • రూ. 67 లక్షలకు పైగా జరిమానాలు

పోలీసులు ఎన్ని తనిఖీలు నిర్వహించినా, కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తున్నా మందుబాబులు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. ఫుల్లుగా మందేసి, పోలీసులకు చిక్కుతూనే ఉన్నారు. జూన్ నెలలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను నిర్వహించిన పోలీసులు 2,735 కేసులు నమోదు చేశారు.

వీరిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా 454 మందికి కోర్టు జైలు శిక్షను విధించింది. ఒక్కొక్కరికి రెండు రోజుల నుంచి గరిష్టంగా నెల రోజుల వరకు శిక్షను ఖరారు చేసింది. పదేపదే తనిఖీల్లో బయటపడిన 101 మంది డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసింది. వీరిలో 12 మంది లైసెన్సులను శాశ్వతంగా... మిగిలిన వారి లైసెన్స్ లను గరిష్టంగా ఏడేళ్ల వరకు రద్దు చేసింది. జరిమానాల రూపంలో పోలీస్ శాఖకు రూ. 67,50,200 జమ అయ్యాయి.

  • Loading...

More Telugu News