allari naresh: మహేష్ బాబు, పూజా హెగ్డేల సమక్షంలో అల్లరి నరేష్ బర్త్ డే

  • 36వ పుట్టిన రోజు జరుపుకున్న అల్లరి నరేష్
  • మహేష్ బాబు చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న నరేష్
  • డెహ్రాడూన్ లో పుట్టినరోజు వేడుకలు

టాలీవుడ్ లో కామెడీ హీరోగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న అల్లరి నరేష్ నిన్న 36వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఆయన పుట్టిన రోజు వేడుకలు డెహ్రాడూన్ లో జరిగాయి. ఈ వేడుకలో మహేష్ బాబు, పూజా హెగ్డే, దర్శకుడు వంశీ పైడిపల్లి తదితరులు పాల్గొన్నారు. వీరంతా కలసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహేష్ బాబు 25వ చిత్రం శరవేగంగా తెరకెక్కుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసనన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రంలోని ఓ ప్రధాన పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు. డెహ్రాడూన్ లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతో, అల్లరి నరేష్ పుట్టిన రోజు వేడుకలను చిత్ర యూనిట్ నిర్వహించింది.

  • Loading...

More Telugu News