priyanka chopra: ప్రియాంకా చోప్రా నిర్మాణ సంస్థకు షాక్... విశ్వభారతి యూనివర్సిటీలో షూటింగ్ కు దక్కని అనుమతి

  • లక్షలాది మంది మనోభావాలకు విఘాతం కలుగుతుంది
  • వాణిజ్య సినిమాల చిత్రీకరణతో వర్సిటీలో వాతావరణం దెబ్బతింటుంది
  • విశ్వభారతి యూనివర్సిటీ అధికారుల సమాధానం

ప్రియాంకా చోప్రాకు చెందిన పర్పుల్ పెబుల్ పిక్చర్స్(పీపీపీ)కు చిక్కులు ఎదురయ్యాయి. ఈ సంస్థ నళిని అనే పేరుతో సినిమా నిర్మాణాన్ని తలపెట్టింది. విశ్వకవి రబీంద్రనాథ్ ఠాగూర్ టీనేజ్ లో ఉన్నప్పుడు, ఓ మరాఠీ యువతితో ఉన్న సంబంధం నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది. ఈ సినిమా షూటింగును పశ్చిమబెంగాల్లోని విశ్వభారతి యూనివర్సిటీలో నిర్వహించాలనుకున్నారు.

అయితే, విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సినిమా నిర్మాణానికి అనుమతి లభించలేదు. "కథ గురించి అధికారులు, ఆశ్రమవాసులతో, ఠాగూర్ గురించి బాగా తెలిసిన నిపుణులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయానికి రావడం జరిగింది. అటువంటి సినిమాల చిత్రీకరణ క్యాంపస్ లో నిర్వహించేందుకు అనుమితించేది లేదు. లక్షలాది మంది మనోభావాలను గాయపరుస్తుంది’’ అని యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ సబుజ్ కోలిసేన్ తెలిపారు. ఇది విద్యా సంస్థ అని, వాణిజ్య సినిమాల చిత్రీకరణకు అనుమతించి వాతావరణాన్ని పాడు చేయదలుచుకోలేదని సేన్ చెప్పారు. ఇదే నిర్ణయాన్ని నళిని సినిమా దర్శకుడు ఉజ్జల్ ఛటర్జీకి వర్సిటీ అధికారులు తెలియజేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని ఛటర్జీ అన్నారు.

priyanka chopra
ppp
production house
movie nalini
tagore
  • Loading...

More Telugu News