Prime Minister: ప్రధాని, ముఖ్యమంత్రి పదవుల నిర్వహణపై గరిష్ట పరిమితులు ఉండాలి: సింధియా
- అమెరికా అధ్యక్ష పదవిని ఒకరు రెండు పర్యాయాలు మాత్రమే నిర్వహించగలరు
- అలాగే, మన దేశంలో పీఎం, సీఎం పదవులకు గరిష్ట పర్యాయాలను నిర్ణయించాలి
- రిటైరయ్యే వారికి పదవీ కాలాన్ని పొడిగించడం కూడా సరికాదు
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులను నిర్వహించే వారికి గరిష్ట పరిమితులు ఉండాలని కాంగ్రెస్ పార్టీ నాయుకుడు, ఆ పార్టీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. ‘‘అమెరికా అధ్యక్ష పదవిని ఒకరు రెండు పర్యాయాలు మాత్రమే నిర్వహించగలరు. అలాగే, ప్రధాని, ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థులకు పర్యాయాలపై పరిమితిని నిర్ణయించాలి’’ అని సింధియా అభిప్రాయపడ్డారు.
పీఎం, సీఎం పదవులపై స్థిర కాల పరిమితులు ఉండాలంటూ దేశంలో స్వరం వినిపించిన తొలి నాయకుడు సింధియానే. పదవీ విరమణ చేసిన ఉద్యోగులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి నియమించుకోవడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. రిటైర్మెంట్ కు దగ్గర్లో ఉన్న వారికి పదవీ కాలాన్ని పొడిగించడంపైనా సింధియా అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘ఒకరు రిటైర్ అవుతున్నారంటే... అతను కార్యాలయాన్ని వదిలివేసి వేచి చూస్తున్న వారికి అవకాశం కల్పించడం. అలాగే, పీఎం, సీఎం పదవులను అలంకరించే వారికీ గరిష్ట పర్యాయాలపై పరిమితి ఉండాలి’’ అని అన్నారు.