Sachin Tendulkar: రెండేళ్ల బుడతడి బ్యాటింగ్ ప్రతిభను చూసి అచ్చెరువొందిన సచిన్ టెండుల్కర్

  • పరిపూర్ణ ఆధునిక కాలపు ఆటగాడు
  • ఆడేలా చూడాలంటూ ట్వీట్ 
  • చిన్నతనంలోనే ట్యాలెంట్ గుర్తించి ప్రోత్సహించాలని సూచన

రెండేళ్ల బాబు బ్యాట్ పట్టుకుని ఆడే తీరును చూసిన సచిన్ టెండుల్కర్ అచ్చమైన ఆధునిక కాలపు ఆటగాడిగా ఉన్నాడంటూ మెచ్చుకున్నారు. లెజెండరీ క్రికెటర్ సచిన్ అభిమాని అయిన హషీమ్ తమ ఇంటి ఆవరణలో సోదరుని కుమారుడు (2) బ్యాట్ పట్టుకుని ఆడుతుండగా వీడియో తీసి దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అతడు మంచిగానే ఆడుతున్నాడా? అంటూ సచిన్ కు, ధోనీకి, కోహ్లీకి ట్వీట్ చేశాడు.

దీన్ని సచిన్ చూసి తన స్పందన తెలియజేయడం విశేషం. చిన్నగా ఉన్నప్పుడే ట్యాలెంట్ ను గుర్తించడమనేది కొత్త మంత్రంగా అభివర్ణించారు. అసాధారణ ప్రతిభావంతులుగా మారేందుకు వారిని ప్రోత్సహించాలని సూచించారు. అంతేకాదు ఆ చిన్నారి ఆట తీరును సచిన్ పరిశీలించి తన అభిప్రాయాలను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘‘నిలువు షాట్లు, వెంట వెంట షాట్లు... పరిపూర్ణ ఆధునిక కాలపు ఆటగాడు, హషీమ్... ఆడిస్తూ, అనందించేలా చూడండి. మీకు నా శుభాకాంక్షలు’’ అని సచిన్ బదులిచ్చారు.

Sachin Tendulkar
2yers old boy
Cricket
  • Loading...

More Telugu News