adhaar: ఆధార్ స్థానంలో వర్చువల్ ఐడీ... ఇకపై ఇది తెలియజేస్తే చాలు

  • ఆధార్ స్థానంలో వర్చువల్ ఐడీకి చోటు
  • ఎవరికివారే వర్చువల్ ఐడీ సృష్టించుకునే అవకాశం
  • వర్చువల్ ఐడీ తీసుకునేందుకు బ్యాంకులకు మాత్రం ఆగస్ట్ వరకు గడువు

అన్నింటికీ ఆధార్ నంబర్ కీలకంగా మారడంతో ఓ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత, సున్నిత వివరాలు లీక్ అవుతాయన్న ఆందోళనకు పుల్ స్టాప్ పడనుంది. ఇకపై 12 అంకెల ఆధార్  నంబర్ ను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీని స్థానంలో వర్చువల్ ఐడీని ఇస్తే సరిపోతుంది. అంటే ఆధార్ ను రుజువుగా పేర్కొనే వారు అసలు ఆధార్ నంబర్ కు బదులు అప్పటికప్పుడు క్రియేట్ చేసుకున్న వర్చువల్ ఐడీని అక్కడ పేర్కొంటే సరిపోతుంది.

దీన్ని జూన్ 1 నుంచే అమలు చేయాలని యూఐడీఏఐ తొలుత ఆదేశించి, ఆ తర్వాత జూలై 1కి పొడిగించింది. దీంతో నేటి నుంచి ఇది అమల్లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఆధార్ నంబర్ తీసుకుంటున్న కాలమ్ లో వర్చువల్ ఐడీని ప్రవేశపెట్టేందుకు వీలుగా తమ వ్యవస్థలను మార్చుకోవాలని అన్ని సంస్థలను యూఐడీఏఐ ఆదేశించింది. ఒక్క బ్యాంకులకు మాత్రం ఆగస్ట్ 31 వరకు గడువు ఇచ్చింది. వర్చువల్ ఐడీ తీసుకునేందుకు సన్నద్ధం కాని సంస్థలపై జరిమానా విధించనున్నట్టు కూడా తెలిపింది. 

  • Loading...

More Telugu News