Balakrishna: రాజకీయాల్లోకి బాలయ్య చిన్నల్లుడు భరత్... విశాఖ నుంచి బరిలోకి!

  • విశాఖ టికెట్ ను ఆశిస్తున్న గీతం అధినేత ఎంవీవీఎస్ మూర్తి
  • కుదరకుంటే తన వారసుడిగా భరత్ కు సీటివ్వాలని వినతి
  • లోకేష్ కు తోడుగా భరత్ ఉంటే బాగుంటుందని భావిస్తున్న బాలయ్య

ఆంధ్రప్రదేశ్ లోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైన విశాఖపట్నం నుంచి తదుపరి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా హీరో నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని భర్త భరత్ రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. ఈ టికెట్ ను ఆశిస్తున్న గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి, అలా కుదరకుంటే, తన వారసుడిగా మనవడైన భరత్ కు సీటు ఇవ్వాలని ఇప్పటికే కోరినట్టు తెలుస్తోంది.

ఆది నుంచి బయటి నుంచి వచ్చి పోటీ చేసిన వారికే పెద్దపీట వేస్తూ వచ్చిన విశాఖ వాసులు, గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థినిగా పోటీపడ్డ విజయమ్మను ఓడించి, బీజేపీకి చెందిన హరిబాబుకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తిరిగి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తిని చూపడం లేదని సమాచారం. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ సీటును తెలుగుదేశం పార్టీ బీజేపీకి వదిలేసిందన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో మంచి పట్టున్న నేతగా, ఓటమెరుగని నేతగా ఉన్న గంటా శ్రీనివాస్ ను అసెంబ్లీకి బదులుగా లోక్ సభకు పంపాలని కూడా తెలుగుదేశం పార్టీ యోచిస్తున్నట్టు వార్తలు వస్తుండగా, ఈ విషయమై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇక లోకేష్ కు తోడుగా తన చిన్నల్లుడు భరత్ ను కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలని బాలయ్య మాత్రం గట్టి పట్టుదలతోనే ఉన్నట్టు సమాచారం.

Balakrishna
Bharat
MVVS Murthy
Vizag
  • Loading...

More Telugu News