Dil: ఆ 'దిల్' కాంబో తిరిగొస్తోంది: నితిన్

  • 2003లో విడుదలైన 'దిల్'
  • నిర్మాత రాజును స్టార్ ప్రొడ్యూసర్ గా మార్చిన 'దిల్'
  • చాలా కాలానికి అదే కాంబినేషన్ లో మరో చిత్రం

'దిల్'... దాదాపు 15 సంవత్సరాల క్రితం విడుదలై నిర్మాతగా రాజును, హీరోగా నితిన్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో నిలిపిన చిత్రం. ఈ సినిమా తరువాత రాజు 'దిల్' రాజుగా గుర్తింపు తెచ్చుకున్నారు కూడా. ఈ సినిమా వీరిద్దరికీ ఎంత పేరు తెచ్చిందో, క్యారెక్టర్ నటుడిగా ప్రకాష్ రాజుకు సైతం అంతే గుర్తింపు తెచ్చింది. ఇక ఇంతకాలం తరువాత ఇదే కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతోంది.

నితిన్, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మాతగా 'శ్రీనివాస కల్యాణం' నిర్మితమవుతుండగా, ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సందర్భంగా నితిన్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, "మళ్లీ మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి దిల్‌ కాంబో వస్తోంది" అని ట్వీట్ చేశాడు. ప్రకాష్ రాజ్, దిల్ రాజులతో తానున్న చిత్రాన్ని పోస్ట్ చేశాడు. 

Dil
Prakash Raj
Nitin
Dil Raju
  • Error fetching data: Network response was not ok

More Telugu News