satyapal singh: నేను సైన్స్ విద్యార్థిని.. నా పూర్వీకులు కోతులు కాదు: కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్

  • చార్లెస్ డార్విన్ సిద్ధాంతాన్ని తప్పుబట్టిన కేంద్రమంత్రి
  • తన వాదనను ఎప్పటికైనా అంగీకరిస్తారని ఆశాభావం
  • తన పూర్వీకులైతే కోతులు కాదన్న నమ్మక ఉందన్న సత్యపాల్

ప్రముఖ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ ‘పరిణామ సిద్ధాంతాన్ని’ కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ తప్పుబట్టారు. తాను సైన్స్ విద్యార్థినని పేర్కొన్న ఆయన డార్విన్ సిద్ధాంతం శాస్త్రీయంగా పూర్తిగా తప్పన్నారు. ఓ సైన్స్ స్టూడెంట్‌గా తన పూర్వీకులు కోతులు కాదని కచ్చితంగా తాను చెప్పగలనన్నారు. తన వ్యాఖ్యలను ఖండిస్తూ విమర్శలు చేస్తున్న వారిపై మంత్రి మండిపడ్డారు.

‘‘నేనో సైన్స్ విద్యార్థిని. రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ కూడా పూర్తి చేశా. నాకు అనుకూలంగా ఎంతమంది నిలబడ్డారు? వ్యతిరేకంగా ఎంతమంది నిలబడ్డారు? మనం ఈ విషయం గురించి ఆలోలించాలి. మనకు మీడియా అంటే భయం. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మరో 10-20 ఏళ్ల తర్వాత.. ఎప్పుడైనా నేను చెప్పేది నిజమని అంగీకరిస్తారు. కనీసం నా పూర్వీకులు కోతులు కాదన్న విశ్వాసం నాకుంది’’ అని మంత్రి పేర్కొన్నారు. ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

satyapal singh
Union minister
Apes
Darwin
  • Loading...

More Telugu News