Aadhar: పాన్ కార్డుకు ఆధార్ అనుసంధానం... గడువును పొడిగించిన కేంద్రం!

  • 2019 మార్చి 31 వరకూ పొడగింపు
  • ప్రకటన విడుదల చేసిన సీబీడీటీ
  • వేచిచూడాలన్న ఆలోచనలో కేంద్రం

పాన్ కార్డుకు ఆధార్ ను అనుసంధానం చేసుకునేందుకు నిన్నటితో సమయం ముగిసిన నేపథ్యంలో, గడువును వచ్చే సంవత్సరం మార్చి 31 వరకూ పొడిగిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), ఓ ప్రకటనను విడుదల చేసింది. పాన్, ఆధార్ అనుసంధానం గడువును పొడగించడం ఇది ఐదోసారి కావడం గమనార్హం.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతంలో జూన్ 30 వరకూ గడువును పొడిగించిన సీబీడీటీ, అది నిన్నటితో ముగియగా, ఆధార్ చట్టబద్ధతపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతున్న నేపథ్యంలో, తీర్పు వెలువడేంత వరకూ పాన్, ఆధార్ అనుసంధానం గడువును పొడిగించాలని కేంద్రం భావిస్తోంది.

Aadhar
Pan Card
CBDT
Supreme Court
  • Loading...

More Telugu News