APSRTC: పనిచేయని టిమ్ యంత్రాలు... ఏపీలో పలుచోట్ల నిలిచిన బస్సులు!

  • పలు ప్రాంతాల్లో నిలిచిన బస్సులు
  • విజయవాడలో ఆగిన కనిగిరి డిపో బస్సులు
  • ప్రయాణికుల ఆందోళన

ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు టికెట్లను జారీ చేసే టిమ్ యంత్రాలు పనిచేయకపోవడమే సమస్యకు కారణమని తెలుస్తోంది. కనిగిరి ఆర్టీసీ డిపోకు చెందిన పలు బస్సులతో పాటు వినుకొండ, నెల్లూరు తదితర డిపోల టిమ్ యంత్రాలు పనిచేయడం లేదని సమాచారం.

తెల్లవారుజామున 3.30 గంటల నుంచి విజయవాడ - కనిగిరి మధ్య ప్రయాణానికి బయలుదేరాల్సిన మూడు బస్సుల్లోని టికెట్ మెషీన్ లు పనిచేయక పోవడంతో, ఈ బస్సులు ప్లాట్ ఫారానికే పరిమితం అయ్యాయి. అప్పటి నుంచి బస్సులు కదలకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే సమస్య నెలకొనివుండగా, రంగంలోకి దిగిన ఆర్టీసీ సాంకేతిక సిబ్బంది టిమ్ యంత్రాలను చక్కదిద్దే పనిలో పడ్డారు.

APSRTC
Vijayawada
Bus
TIM
Ticket
  • Loading...

More Telugu News