deve gowda: హైదరాబాద్‌కు దేవెగౌడ పయనం.. సాయంత్రం కేసీఆర్‌తో కీలక భేటీ

  • విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలకనున్న తలసాని
  • అనంతరం ప్రగతి భవన్‌కు దేవెగౌడ
  • ఫెడరల్ ఫ్రంట్, జాతీయ రాజకీయాలపై చర్చలు

దేశంలో గుణాత్మక మార్పు కోసం అంటూ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన దేశంలోని పలువురు కీలక రాజకీయ నేతలను కలిసి చర్చించారు. కొన్ని రోజుల క్రితం జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడను కూడా ఆయన కలిశారు. కాగా, ఈరోజు సాయంత్రం 6 గంటలకు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో దేవెగౌడ హైదరాబాద్‌కు రానున్నారు.

బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, అధికారులు స్వాగతం పలుకుతారు. అనంతరం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో దేవెగౌడ సమావేశమై, ఫెడరల్ ఫ్రంట్, జాతీయ రాజకీయాలపై చర్చిస్తారు.

deve gowda
Hyderabad
  • Loading...

More Telugu News