Nara Lokesh: మీకు దమ్ము, ధైర్యం ఉంటే ఢిల్లీలో పోరాడండి.. ఇక్కడ కాదు: నారా లోకేశ్

  • విభజన జరిగినప్పుడు కొన్ని హామీలిచ్చారు
  • అందులో ఉక్కు కర్మాగారం కూడా ఉంది
  • కేంద్ర సర్కారుని ప్రతిపక్షాలు నిలదీయట్లేదు
  • చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగినప్పుడు కొన్ని హామీలిచ్చారని, అందులో ఉక్కు కర్మాగారం కూడా ఉందని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఉక్కు కర్మాగారం కోసం దీక్ష చేస్తోన్న ఎంపీ సీఎం రమేష్‌ ఈరోజు తన దీక్షను విరమించిన విషయం తెలిసిందే. అంతకు ముందు మంత్రి నారా లోకేశ్‌ ఆయనను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వైసీపీ ఎంపీలు ఏనాడైనా ఉక్కు పరిశ్రమ కోసం పోరాడారా? అని ప్రశ్నించారు.

ఉక్కు కర్మాగారం ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమనీ, అయితే ఏనాడూ కేంద్రాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాని మోదీని నిలదీయడం లేదని, వారు చేయాల్సిన పోరాటాలు ఇక్కడ కాదని.. దమ్ము, ధైర్యం ఉంటే ఢిల్లీలో చేయండని లోకేశ్‌ సవాలు విసిరారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తోన్న విమర్శలకు స్క్రిప్టు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా రాసిస్తున్నారని అన్నారు. ఏపీలో 25 లోక్‌సభ సీట్లు తమ పార్టీకే రావాలని, అప్పుడే కేంద్రంలో మనం కీలకంగా వ్యవహరించి రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకుంటామని అన్నారు. 

  • Loading...

More Telugu News