mehreen: వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్నా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేను: మెహ్రీన్

  • ఈరోజు సాయంత్రం 6 గంటలకు 'పంతం' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న మెహ్రీన్
  • జులై 5న మనమంతా కలిసి సినిమా చూద్దాం అని ట్వీట్

గోపీచంద్, మెహ్రీన్ హీరో హీరోయిన్ లుగా నటించిన 'పంతం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ నేపథ్యంలో, ఈ సినిమాలో కథానాయికగా నటించిన మెహ్రీన్ తన ఆరోగ్యం సహకరించడం లేదని, తీవ్రమైన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని ట్వీట్ చేసింది.

'మీరెంతగానో ఎదురుచూస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఫీవర్ కారణంగా రాలేకపోతున్నా.. హైదరాబాద్ లో జులై 5న మనమంతా కలిసి సినిమా చూద్దాం' అంటూ తన ట్వీట్ లో పేర్కొంది.

mehreen
pantham
event
Tollywood
Hyderabad
  • Loading...

More Telugu News