Chandrababu: అసలు పింక్ డైమండే లేదు.. ఓ పూజారి చెప్పిన మాటలకు జగన్, పవన్ వత్తాసు పలుకుతున్నారు: చంద్రబాబు ఆగ్రహం

  • పింక్ డైమండే లేదు.. ఉందని చెబుతున్నారు
  • చివరకు వేంకటేశ్వరస్వామితో కూడా ఆడుకుంటున్నారు
  • నాపై తప్పుడు ప్రచారం చేయడమే వీరి లక్ష్యం

విపక్ష నేతలు చివరకు తిరుమల వేంకటేశ్వరస్వామితో కూడా ఆడుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసలు శ్రీవారికి పింక్ డైమండే లేదని... డైమండ్ ఉందంటూ ఓ పూజరి చెబుతున్న మాటలకు వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. వీళ్ల నిర్వాకం వల్లే తిరుమలను తామెందుకు స్వాధీనం చేసుకోకూడదంటూ ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ లేఖ రాసే పరిస్థితి వచ్చిందని అన్నారు.

 స్వామివారి నగలన్నీ లెక్కల ప్రకారమే ఉన్నాయని... లెక్కలు లేవని వీరు అంటుంటారని విమర్శించారు. తనపై తప్పుడు ప్రచారం చేయడమే వీరి పని అని మండిపడ్డారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా... రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. ఏపీని దేశంలోనే నెంబర్ వన్ చేసే బాధ్యతను తాను తీసుకున్నానని... ప్రజలంతా తనకు సహకరించాలని కోరారు.

Chandrababu
Pawan Kalyan
jagan
pink diamond
  • Loading...

More Telugu News