Chandrababu: ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతానంటున్నారు.. ఏమైనా అర్థం ఉందా?: పవన్ కల్యాణ్ పై చంద్రబాబు నిప్పులు

  • విశాఖను అభివృద్ధి చేసింది నేనే
  • ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట
  • జగన్, గాలిలతో బీజేపీ నాటకాలు ఆడిస్తోంది

బీజేపీకి ఓ వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్, మరోవైపు వైసీపీ అధినేత జగన్ లు ఉన్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేసేందుకు పోరాడతానని పవన్ అంటున్నారని... ఆయన చెప్పే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? అని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని... విశాఖపట్నంను అభివృద్ధి చేసింది తానేనని చెప్పారు. అలాంటి ఉత్తరాంధ్రలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

గాలి జనార్దన్ రెడ్డి, జగన్ లతో బీజేపీ నాటకాలు ఆడిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ తన తమ్ముడు అని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారని... ఈ అన్నదమ్ములు ఇద్దరి సంగతి ఏంటో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. వైయస్ హయాంలో గాలి జనార్దన్ రెడ్డి చేత బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ పెట్టించేందుకు యత్నించారని అన్నారు. 

Chandrababu
Pawan Kalyan
jagan
gali janardhan reddy
bjp
  • Loading...

More Telugu News