amit shah: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అమిత్ షా

  • బీజేపీ జనచైతన్య యాత్రలపై అమిత్ షా ఆనందం
  • రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్లాలంటూ సూచన
  • జులై 13న హైదరాబాద్ వస్తున్న అమిత్ షా

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన జనచైతన్య యాత్రలపై ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ సూచించారు. అమిత్ షా ఫోనుతో మరింత ఉత్సాహంగా యాత్రలను నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

మరోవైపు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమీక్ష కోసం అమిత్ షా జులై 13న హైదరాబాద్ రానున్నారు. జులై 5న హన్మకొండలో జరగనున్న చైతన్య యాత్రకు రామ్ మాధవ్ వస్తున్నారు. 6న తుంగతుర్తిలో జరిగే ముగింపు సభకు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ హాజరవుతున్నారు.

amit shah
lakshman
phone
  • Loading...

More Telugu News