anasuya: మరో సినిమా ఛాన్స్ కొట్టేసిన అనసూయ!

  • వైయస్ జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న 'యాత్ర'
  • లీడ్ రోల్ పోషిస్తున్న మమ్ముట్టి
  • కర్నూలు జిల్లా మహిళానేత పాత్రలో అనసూయ

బుల్లి తెర నుంచి వెండి తెరకు వెళ్లిన అనసూయ... తనదైన శైలిలో ప్రేక్షకులకు దగ్గరైంది. వరుస సినీ ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయి. తాజాగా దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'యాత్ర' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ సినిమాలో వైయస్ పాత్రను మమ్ముట్టి పోషిస్తున్నారు. అనసూయకు కూడా ఈ చిత్రంలో అవకాశం దక్కింది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ పాప్యులర్ మహిళానేత పాత్రను అనసూయ పోషించబోతోందని టాలీవుడ్ టాక్. పాత్ర చిన్నదే అయినా... సినిమాకు ఉన్న ప్రాధాన్యత, క్రేజ్ ను బట్టి... తనకు వచ్చిన ఆఫర్ కు అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

anasuya
ysr
biopic
yatra
tollywood
  • Loading...

More Telugu News