malakondaiah: ఏపీ డీజీపీ మాలకొండయ్యకు ఘనంగా వీడ్కోలు

  • నేడు పదవీ విరమణ చేస్తున్న మాలకొండయ్య
  • ఘనంగా వీడ్కోలు పలికిన పోలీసు సిబ్బంది
  • డీజీపీగా అవకాశం కల్పించిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన మాలకొండయ్య

ఏపీ డీజీపీ మాలకొండయ్య నేడు పదవీ విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. పరేడ్ గ్రౌండ్లో ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీజీపీగా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తన హయాంలో కొత్తగా 6వేల మంది సిబ్బందిని నియమించామని చెప్పారు. రాష్ట్రంలో క్రైమ్ ను తగ్గించగలిగామని తెలిపారు. వీడ్కోలు కార్యక్రమంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు గౌతమ్ సవాంగ్, ఆర్పీ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.

malakondaiah
ap dgp
Chandrababu
  • Loading...

More Telugu News