DGP: ఏపీకి కొత్త డీజీపీ కావలెను... కసరత్తు ప్రారంభించిన చంద్రబాబు!

  • నేడు మాలకొండయ్య పదవీ విరమణ
  • రేస్ లో గౌతమ్ సవాంగ్
  • ఆర్పీ ఠాకూర్, సురేంద్ర బాబు కూడా

ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మాలకొండయ్య నేడు పదవీ విరమణ చేయనుండటంతో, మరో డీజీపీ ఎంపికపై సీఎం చంద్రబాబునాయుడు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే కేంద్ర హోమ్ శాఖ వర్గాలతో పాటు మంత్రులతోనూ ఆయన చర్చలు సాగించినట్టు తెలుస్తోంది. కొత్త డీజీపీ ఎవరన్న విషయమై నేడే నిర్ణయం వెలువడవచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కొత్త డీజీపీ రేసులో గౌతమ్ సవాంగ్, ఆర్పీ ఠాకూర్, ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న సురేంద్రబాబు పేర్లు వినిపిస్తుండగా, గౌతమ్ సవాంగ్ కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. కొత్త డీజీపీగా చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

DGP
Andhra Pradesh
Chandrababu
Gautam Sawang
Malakondaiah
RP Thakur
  • Loading...

More Telugu News