Andhra Pradesh: ఏపీలో బీజేపీకి అంత సీన్‌ లేదు.. మోదీ మనకు వెన్నుపోటు పొడిచారు: లోకేశ్‌

  • ఆ పార్టీకి ఆదరణ లేకపోయినప్పటికీ పొత్తు పెట్టుకున్నాం
  • రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆ పని చేశాం 
  • ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంటూ కేంద్ర సర్కారు మోసం 
  • 2019లో బీజేపీ అసలైన సినిమా చూస్తుంది

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి అంత సీన్‌ లేదని, ఆ పార్టీకి ఆదరణ లేకపోయినప్పటికీ తాము రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని జేఎన్టీయూ మైదానంలో టీడీపీ ధర్మ పోరాట సభ నిర్వహిస్తోంది. ఈ సభకు సుమారు లక్ష మంది హాజరైనట్లు సమాచారం. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ... ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంటూ కేంద్ర సర్కారు మోసం చేసిందని, మోదీ మనకు వెన్నుపోటు పొడిచారని అన్నారు.

నాలుగేళ్లు ఓపిక పట్టి తాము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశామని లోకేశ్‌ అన్నారు. లోటు బడ్జెట్‌ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ఏపీని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఇబ్బందులున్నా రైతులకు రుణమాఫీ చేశారని అన్నారు. తెలుగు జాతితో పెట్టుకోవద్దని, కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ చూసింది కేవలం ట్రైలర్‌ మాత్రమేనని, 2019లో అసలైన సినిమా చూస్తుందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News