rape: రేప్ కేసులో ఇద్దరికి ఇరవై ఏళ్ల చొప్పున జైలుశిక్ష!

  • 2013 ఏప్రిల్ లో అత్యాచారం
  • ఇద్దరు వ్యక్తులను దోషులుగా తేల్చిన కోర్టు
  • జైలు శిక్షతో పాటు జరిమానా విధింపు  

ఓ యువతిపై అత్యాచారం చేసిన కేసులో కరీంనగర్ లోని ఐదో అదనపు సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరికి 20 ఏళ్ల చొప్పున జైలు శిక్షను విధించింది. దీంతో పాటు రూ. 5 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది. కేసు వివరాల్లోకి వెళ్తే, బెల్లంపల్లికి చెందిన ఓ యువతిపై 2013 ఏప్రిలో లో రాజ్ కుమార్, సమీర్ అనే వ్యక్తులు అత్యాచారం చేశారు. రైల్వే స్టేషన్ లో ఉన్న బాధితురాలిని నమ్మించి తీసుకెళ్లి, ఘోరానికి పాల్పడ్డారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి నాగరాజు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News