kcr: తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఎన్ని సీట్లొస్తాయో మాత్రం చెప్పను: జానారెడ్డి

  • ఏ కారణంతో ముందస్తు ఎన్నికలకు వెళ్తారో కేసీఆర్ చెప్పాలి
  • ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేము సిద్ధమే
  • కర్ణాటక తరహా సర్కార్ ఏర్పాటు చేసినా ఆశ్చర్యం లేదు

ఏ కారణంతో ముందస్తు ఎన్నికలకు వెళ్తారో సీఎం కేసీఆర్ చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ సవాల్ చేయడం హాస్యాస్పదమని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని, తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన జానారెడ్డి, ఎన్ని సీట్లు వస్తాయో మాత్రం చెప్పనని, కర్ణాటక తరహా సర్కార్ ఏర్పాటు చేసినా ఆశ్చర్యం లేదని అన్నారు.

టీఆర్ఎస్ నేత డీఎస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారనే సమాచారం తనకు లేదని, ‘కాంగ్రెస్’లో బీసీలకు అన్యాయం జరుగుతోందన్న దానం నాగేందర్ వ్యాఖ్యలు అబద్ధమని అన్నారు. టీపీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి పనితీరు సంతృప్తికరంగా ఉందని, పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందనుకోవడం లేదని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. 

kcr
janareddy
  • Error fetching data: Network response was not ok

More Telugu News