galla jayadev: ఇటువంటి వీడియోలు రానున్న రోజుల్లో ఇంకా వస్తాయి.. ఇవన్నీ కుట్రలో భాగం!: గల్లా జయదేవ్‌

  • ఇది వైసీపీ కుట్ర
  • అమిత్‌ షా చేసే రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయి
  • ప్రసారం చేసే ముందు మీడియా నిర్ధారించుకోవాలి

ఢిల్లీలో ఓ గదిలో కూర్చున్న టీడీపీ ఎంపీలు 'బరువు తగ్గాలనుకుంటే నిరాహార దీక్ష చేస్తాను' అంటూ సరదాగా మాట్లాడుకుంటుండగా తీసిన వీడియో బయటకు రావడంతో విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఆ వీడియోపై టీడీపీ ఎంపీలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే ఈ విషయంపై ట్వీట్‌ చేసిన ఎంపీ గల్లా జయదేవ్‌ మీడియాతో మాట్లాడుతూ మరోసారి ఆ వీడియోపై స్పందించారు.

రానున్న రోజుల్లో ఇటువంటి ఫేక్‌ వీడియోలు ఎక్కువవుతాయని, ఆ వీడియో బీజేపీ కుట్రలో భాగమని ఆయన అన్నారు. వైసీపీ, జనసేనలను బీజేపీ ఇటువంటి చర్యలకు ఉపయోగించుకుంటోందని అన్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా చేసే రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయని అన్నారు. ఇటువంటివి ప్రసారం చేసే ముందు మీడియా నిర్ధారించుకోవాలని అన్నారు.           

galla jayadev
Andhra Pradesh
YSRCP
BJP
Telugudesam
  • Loading...

More Telugu News