Ganta Srinivasa Rao: కట్‌, పేస్ట్‌ చేసి ఉండొచ్చు... 'దీక్షల వీడియో'పై గంటా శ్రీనివాసరావు

  • మేము చేసే దీక్షలు క్రెడిట్ కోసం కాదు
  • బీజేపీ నేతలే ఆ క్రెడిట్ తీసుకుని ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలి
  • టీడీపీ ఎంపీల వీడియోపై వాస్తవాలు బయటకు రావాలి

రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీ నేతలు చేస్తోన్న దీక్షలకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదించాలని చూస్తే ప్రజలు క్షమించబోరని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ... ఎంపీ సీఎం రమేష్‌ చేస్తోన్న ఆమరణ నిరాహార దీక్షపై విమర్శలు చేయకూడదని అన్నారు. తమకు దొంగదీక్షలు చేయడం రాదని, బీజేపీ నేతలకే ఆ అలవాటు ఉందని అన్నారు.
 
తాము చేసే దీక్షలు క్రెడిట్ కోసం కాదని, బీజేపీ నేతలే ఆ క్రెడిట్ తీసుకుని ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలని అన్నారు. టీడీపీ ఎంపీల సంభాషణల వీడియోపై వాస్తవాలు బయటకు రావాలని అన్నారు. వీడియోలను, వాయిస్‌లను కట్‌, పేస్ట్‌ చేసే అవకాశం ఉంటుందని అన్నారు.

Ganta Srinivasa Rao
Andhra Pradesh
Telugudesam
  • Loading...

More Telugu News