jagan: జగన్, పవన్ లపై మండిపడ్డ గల్లా జయదేవ్

  • రాష్ట్ర హక్కుల కోసం మేము పోరాడుతుంటే... వీరు మౌనం వహిస్తున్నారు
  • తప్పుడు ప్రచారాలు చేసే పనిలో బిజీగా ఉన్నారు
  • మోదీ, అమిత్ షాలతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు

వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్ తో పాటు, రాష్ట్ర హక్కుల కోసం తాము పోరాడుతుంటే... వీరిద్దరు మాత్రం ఆశ్చర్యకరంగా రాష్ట్రం కోసం ఏమాత్రం పోరాటం చేయకుండా...  మౌనం వహిస్తున్నారని విమర్శించారు. 20 సెకన్ల వీడియోను ప్రచారం చేసే పనిలో బిజీగా ఉన్నారని... తమ పోరాటాన్ని చులకన చేసేందుకు యత్నిస్తున్నారని, తద్వారా అందరి దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలను నిలదీయాల్సింది పోయి... వారితో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

jagan
Pawan Kalyan
modi
amit shah
galla jayadev
  • Loading...

More Telugu News