raja meeru keka: కెమెరామెన్ భార్యను వేధించిన టాలీవుడ్ నిర్మాత.. కేసు నమోదు

  • 'రాజా మీరు కేక' సినిమా నిర్మాతపై కేసు నమోదు
  • కెమెరా మెన్ భార్యతో అసభ్య ప్రవర్తన
  • ఎస్ఆర్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన కెమెరామెన్

తెలుగు సినీ నిర్మాత రమేష్ రెడ్డిపై హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మహిళను వేధించిన నేపథ్యంలో కేసు నమోదు చేశారు. కేసు వివరాల్లోకి వెళ్తే... 'రాజా మీరు కేక' అనే సినిమాను రమేష్ రెడ్డి నిర్మించారు. ఆ సినిమాకు రవి రెడ్డి కెమెరామెన్ గా పని చేశారు. షూటింగ్ పూర్తయిన తర్వాత రవికి రమేష్ రూ. 2 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలంటూ పదేపదే రవి ఇంటికి రమేష్ వెళ్లాడట. ఈ క్రమంలో రవి రెడ్డి భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడట. దీంతో, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో రమేష్ రెడ్డిపై రవి కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తును ప్రారంభించారు.


raja meeru keka
movie
producer
ramesh reddy
case
tollywood
  • Loading...

More Telugu News