Online: కొత్త తరహా ఆన్ లైన్ మోసం... రూ. 3 లక్షలు పోగొట్టుకున్న విజయవాడ యువతి!

  • బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన ఫోన్ నంబర్ మార్పు
  • ఆపై ఖాతా నుంచి పేటీఎం ఖాతాలోకి డబ్బు
  • నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామన్న పోలీసులు

విజయవాడలో ఓ కొత్త తరహా ఆన్ లైన్ మోసం జరుగగా, నిందితుడి కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, గాయత్రి అనే యువతి బ్యాంకు ఖాతాలోని రూ. 3 లక్షల నగదు మాయమైంది. ఈ విషయంలో ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

 సైబర్ మోసానికి పాల్పడ్డ ఓ వ్యక్తి, ఆన్ లైన్ మాధ్యమంగా గాయత్రి బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉన్న ఫోన్ నంబర్ ను మార్చాడు. ఆపై ఆమె ఖాతా సంఖ్య, కార్డు వివరాలతో డబ్బును పేటీఎంలోకి బట్వాడా చేసుకున్నాడు. నిందితుడు హైదరాబాద్ కు చెందిన వ్యక్తని మాత్రమే గుర్తించామని, అతను ఎవరన్న విషయాన్ని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. గాయత్రికి పరిచయమున్న వ్యక్తే ఈ పని చేసివుండవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు.

Online
Fruad
Bank Account
Paytm
Police
Vijayawada
  • Loading...

More Telugu News