Andhra Pradesh: మంత్రి అఖిలప్రియకు హైకోర్టులో ఊరట.. న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత

  • మంత్రిగా కొనసాగే అర్హత లేదంటూ పిటిషన్
  • పిటిషనర్‌కే అర్హత లేదన్న కోర్టు
  • న్యాయవాదికి మొట్టికాయలు

వైసీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరిన భూమా అఖిలప్రియకు మంత్రిగా కొనసాగే అర్హత లేదంటూ గిన్నె మల్లేశ్వరరావు అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఇటువంటి వ్యాజ్యం దాఖలు చేసే అర్హత పిటిషనర్‌కు లేదని మొట్టికాయలు వేసింది. అనర్హత వేటుకు సంబంధించిన ఫిర్యాదులు స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్న విషయాన్ని పిటిషన్‌దారుడే పేర్కొన్నారు కాబట్టి, దానితో అతడికి ఎలాంటి సంబంధం లేదని చెబుతూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. దీంతో అఖిలప్రియకు ఊరట లభించినట్టు అయింది.

Andhra Pradesh
Akhilapriya
Minster
High Court
  • Loading...

More Telugu News