పిల్లల భవిష్యత్ కోసం పవన్ తో టచ్ లో ఉంటాను: నటి రేణూ దేశాయ్
- నాకు పెళ్లయిన తర్వాత కూడా పవన్ తో టచ్ లో ఉంటా
- ఎందుకంటే, ఇద్దరు పిల్లలకు ఆయన తండ్రి
- ఓ అభిమాని ప్రశ్నకు రేణూ దేశాయ్ సమాధానం
‘మీకు పెళ్లయిన తర్వాత కూడా పవన్ తో టచ్ లో ఉంటారా?’ అని ఆ అభిమాని ప్రశ్నించగా.. ‘తప్పకుండా ఉంటాను. ఎందుకంటే, అకీరా, ఆద్య అనే ఇధ్దరు పిల్లలకు ఆయన (పవన్) తండ్రి. పిల్లల భవిష్యత్ కోసం ఆయనతో టచ్ లో ఉండాల్సిందే. పిల్లలకు సెలవులు వచ్చినప్పుడు లేదా ఏవైనా వేడుకలు, వచ్చినప్పుడు పిల్లలిద్దరూ ఆయన దగ్గరకు వెళతారు’ అని రేణూ చెప్పింది.