bahubali: ‘బాహుబలి -2’కి మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు

  • శాటరన్ అవార్డు దక్కించుకున్న ‘బాహుబలి: ది కన్ క్లూజన్’
  • సంబంధిత కేటగిరీలో పోటీపడ్డ ఆరు చిత్రాలు 
  • సినీ ప్రముఖులు, అభిమానుల హర్షం

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుత చిత్రం ‘బాహుబలి’కి మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు దక్కింది. ఫిబ్రవరి 2017 - ఫిబ్రవరి 2018 మధ్య విడుదలైన చిత్రాల్లో విశేషంగా ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అమెరికాకు చెందిన అకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ అండ్ హారర్ ఫిల్మ్స్ సంస్థ శాటరన్ అవార్డులను ప్రతి ఏటా అందజేస్తుంటుంది. ఇందులో భాగంగా 44వ శాటరన్ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది జరిగింది. నిన్న జరిగిన కార్యక్రమంలో సంబంధిత కేటగిరీలో మొత్తం ఆరు చిత్రాలు పోటీ పడగా ‘బాహుబలి: ది కన్ క్లూజన్’కు ఈ అవార్డు దక్కింది. కాగా, ‘బాహుబలి’కి ఈ అవార్డు దక్కడంపై సినీ ప్రముఖులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

bahubali
Rajamouli
saturn awards
  • Loading...

More Telugu News