Telugudesam: ముగిసిన భేటీ.. కడపలో ఉక్కు పరిశ్రమపై మీడియాతో మాట్లాడిన బీరేంద్ర సింగ్!
- అధికారులతో చర్చించిన తరువాత త్వరలో స్పష్టత ఇస్తాను
- ఉక్కు కర్మాగారంపై రాష్ట్ర ప్రభుత్వం సమాచారం పంపింది
- దానిపై అధికారులతో చర్చిస్తాను
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీలు ఈరోజు ఢిల్లీలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌తో చర్చించిన విషయం తెలిసిందే. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ఆయనకు ఎంపీలు పూర్తి సమాచారాన్ని అందించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారాన్ని మెకాన్‌కు పంపాలని ఎంపీలకు బీరేంద్ర సింగ్ సూచించారు. ఇవ్వాల్సిన సమాచారాన్ని ప్రభుత్వ ఫార్మాట్‌లో మెకాన్‌కు పంపాలని చెప్పారు. అయితే, తాము ఇప్పటికే మెకాన్‌కు పంపినట్లు ఏపీఎండీసీ ఛైర్మన్ వెంకయ్య చౌదరి తెలిపారు.
కాగా, భేటీ ముగిసిన తరువాత బీరేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ... తాను అధికారులతో చర్చించిన తరువాత త్వరలో స్పష్టత ఇస్తానని అన్నారు. ఉక్కు కర్మాగారంపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన సమాచారంపై అధికారులతో చర్చిస్తానని తెలిపారు. ఈ విషయంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా సమీక్ష జరుపుతున్నారని అన్నారు.