vaishnav tej: హీరోగా రంగంలోకి దిగుతోన్న సాయిధరమ్ తేజ్ తమ్ముడు

  • నటనలో శిక్షణ పొందిన వైష్ణవ్ తేజ్ 
  • నిర్మాతగా రామ్ తాళ్లూరి 
  • దర్శకుడిగా సాగర్ కె.చంద్ర  

చిరంజీవి మేనల్లుడిగా తెరపైకి వచ్చిన సాయిధరమ్ తేజ్, మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేస్తూ వచ్చాడు. చిరంజీవి స్టైల్ ను అనుకరిస్తూ .. ఆయన హిట్ సాంగ్స్ ను రీమిక్స్ చేస్తూ మెగా అభిమానుల దృష్టిని తన వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు. త్వరలో సరైన హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు.

ఈ నేపథ్యంలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ రెడీ అవుతున్నాడు. నటన పట్ల ఆసక్తి కలగడంతో ఇతర మెగా హీరోల సలహాలను .. సూచనలను వైష్ణవ తేజ్ తీసుకున్నాడట. ఆ ప్రకారం ఒక వైపున చదువును పూర్తి చేస్తూనే, మరో వైపున నటన .. డాన్స్ .. ఫైట్స్ విషయంలో శిక్షణ తీసుకున్నాడని అంటున్నారు. అప్పటి నుంచి కథలు వింటూ వస్తోన్న వైష్ణవ్ తేజ్ కి, దర్శకుడు సాగర్ కె. చంద్ర వినిపించిన కథ తెగ నచ్చేసిందట. దాంతో వెంటనే వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా చెబుతున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాణంలో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తెలుస్తోంది. 

vaishnav tej
  • Loading...

More Telugu News