gvl narasimha rao: టీడీపీ డ్రామాలు ఆపాలి: జీవీఎల్ నరసింహారావు

  • టీడీపీ ఎంపీలవన్నీ డ్రామాలు
  • ఉక్కు మంత్రి ఢిల్లీలో లేరు... డ్రామాకు ఒక్క రోజు విరామం ఇవ్వండి
  • స్టీల్ ప్లాంట్ కు బీజేపీ కట్టుబడి ఉంది

తెలుగుదేశం పార్టీపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన సమాచారాన్ని ఏడు నెలలు ఆలస్యంగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. కేవలం ప్రచారం కోసమే టీడీపీ నేతలు ఆరాటపడుతున్నారని, రాష్ట్ర అభివృద్ధి కోసం వారు తపన పడటం లేదని విమర్శించారు.

కేంద్ర ఉక్కు మంత్రి బీరేంద్ర సింగ్ ఢిల్లీలో అందుబాటులో లేరని... అందువల్ల టీడీపీ ఎంపీలు వారి డ్రామాకు ఒక రోజు విరామం ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ కు బీజేపీ కట్టుబడి ఉందని... తెలుగుదేశం పార్టీనే ప్లాంట్ ను అడ్డుకుంటోందని అన్నారు. టీడీపీ నేతలు చెబుతున్నవన్నీ అసత్యాలేనని చెప్పారు.

gvl narasimha rao
Telugudesam
mp
steel plant
kadapa
  • Loading...

More Telugu News