CM Ramesh: సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితి విషమించింది: డాక్టర్ గిరిధర్

  • రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గింది
  • యూరిన్ లో కీటోన్ బాడీస్ పెరిగాయి
  • ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఉంది

కడప ఉక్కు కర్మాగారం కోసం టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న ఆమరణ దీక్ష తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. రిమ్స్ వైద్యులు ఆయనకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిధర్ మాట్లాడుతూ, సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని తెలిపారు. రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గిందని ఆయన వెల్లడించారు. సీరమ్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ రెట్టింపయ్యానని తెలిపారు. యూరిన్ లో కీటోన్ బాడీస్ పెరిగాయని చెప్పారు. ఇప్పటికే సీఎం రమేష్ ఐదు కేజీల బరువు తగ్గారని వెల్లడించారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రమేష్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. సాయంత్రం మళ్లీ ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు.

CM Ramesh
health
condition
kadapa
steel plant
  • Loading...

More Telugu News