Chiranjeevi: 'సైరా' తాజా షెడ్యూల్ ఖర్చు 40 కోట్లు!

  • సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా'
  • పోరాట సన్నివేశాల చిత్రీకరణ 
  • వచ్చే వేసవిలో విడుదల  

చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా రూపొందుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే స్వాతంత్ర్య సమరయోధుడి కథ ఇది. 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను చరణ్ నిర్మిస్తున్నాడు. తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో వేసిన భారీ సెట్లో జరుగుతోంది. నరసింహారెడ్డికి .. ఆంగ్లేయులకు మధ్య రాత్రివేళలో జరిగే పోరాట సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు.

 నరసింహారెడ్డిలోని వీరోచిత నాయకుడిని ఆవిష్కరించే సన్నివేశాలు ఇవి. అందువలన హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో హాలీవుడ్ ఫైటర్స్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ కారణంగా ఈ ఒక్క షెడ్యూల్ కోసమే 40 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. సినిమాలో కీలకమైన సందర్భంలో వచ్చే ఈ సన్నివేశాలు హైలైట్ గా నిలవడం ఖాయమని అంటున్నారు. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయనున్నారు.        

Chiranjeevi
nayanatara
  • Loading...

More Telugu News