ntr: రాజమౌళి మల్టీ స్టారర్ మూవీలో కీర్తి సురేశ్?

  • రాజమౌళి మల్టీ స్టారర్ కి సన్నాహాలు
  • హీరోలుగా ఎన్టీఆర్ .. చరణ్  
  • కథానాయికల విషయంలో పెరుగుతోన్న ఆసక్తి

రాజమౌళి తాజా చిత్రంగా భారీ మల్టీ స్టారర్ రూపొందనుందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటించనున్న ఈ సినిమా, అక్టోబర్లో పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. నవంబర్లో ఎన్టీఆర్ .. డిసెంబర్లో చరణ్ షూటింగులో జాయిన్ కానున్నారు. ఈ ఇద్దరు హీరోల సరసన కథానాయికలుగా ఎవరు నటించనున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూ వస్తోంది.

ఒక కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకోవాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడనేది తాజా సమాచారం. 'మహానటి' చూసిన రాజమౌళి .. కీర్తి సురేశ్ నటనను ప్రశంసించిన సంగతి తెలిసిందే. కీర్తి సురేశ్ ను తీసుకోవడమే జరిగితే .. ఎవరి జోడీగా అనేది కూడా ఆసక్తిని రేకెత్తించే విషయమే. ఇటు ఎన్టీఆర్ తో జోడీకట్టినా .. అటు చరణ్ సరసన కనిపించినా ఫ్రెష్ కాంబినేషన్ కావడం విశేషం. భారీ అంచనాలున్న ఈ సినిమాలో రెండవ కథానాయిక ఎవరనే విషయమూ కుతూహలాన్ని కలిగించేదే!   

ntr
charan
keerthi suresh
  • Loading...

More Telugu News