jagan: జగన్ 201వ రోజు పాదయాత్ర రద్దు

  • అనుకూలించని వాతావరణం
  • వర్షం కారణంగా రద్దైన పాదయాత్ర
  • నిన్న 200 రోజులు పూర్తి చేసుకున్న యాత్ర

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర నిన్నటితో 200వ రోజు మైలురాయిని చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈరోజు పాదయాత్ర వర్షం కారణంగా రద్దయింది. షెడ్యూలు ప్రకారం నేటి పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా భీమనపల్లి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో... పాదయాత్ర సాధ్యం కాలేదు. దీంతో, యాత్రకు విరామం ప్రకటించారు. మరోవైపు, పాదయాత్ర 200వ రోజు పూర్తయిన సందర్భంగా జగన్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దేవుడి దయ వల్ల అధికారంలోకి వస్తే రాజన్న పాలనను తీసుకొస్తానని చెప్పారు. 

jagan
padayatra
  • Loading...

More Telugu News