dil raju: ఇంద్రగంటిపై దృష్టి పెట్టిన దిల్ రాజు!

  • విభిన్న కథా చిత్రాల దర్శకుడు 
  • పాత్రల చిత్రీకరణలో ప్రత్యేక శైలి 
  • 'సమ్మోహనం'తో మరింత పెరిగిన క్రేజ్

విభిన్నమైన కథలను తయారుచేసుకుని .. ఆసక్తికరమైన కథనంతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఇంద్రగంటి మోహనకృష్ణ ముందుకు వెళుతున్నారు. కథాకథనాలను నడిపించడంలోను .. పాత్రలను మలిచే విధానంలోను ఆయన తనదైన శైలిని కనబరుస్తూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇటీవల థియేటర్లకు వచ్చిన 'సమ్మోహనం' సినిమా .. దర్శకుడిగా ఆయనను మరింత ఎత్తులో కూర్చోబెట్టింది.

దాంతో ఆయనతో కలిసి పనిచేయడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తిని చూపుతున్నారు. ఇక యువ కథానాయకులంతా ఆయన సినిమాలో చేయడానికి తెగ ఉత్సాహాన్ని చూపించేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన బ్యానర్లో చేయమంటూ ఇంద్రగంటి డేట్స్ ను దిల్ రాజు లాక్ చేశాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. దిల్ రాజు వంటి ప్రొడ్యూసర్ దొరకడం కన్నా ఇంద్రగంటికి మాత్రం కావాల్సినదేవుంటుంది? ఈ ఇద్దరి కాంబినేషన్లో వరుసగా సినిమాలు వచ్చే అవకాశాలు వున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

dil raju
indraganti
  • Loading...

More Telugu News