Tamilnadu: మరోమారు పోలీసులకు చిక్కిన సినీ నటుడు జై.. హెచ్చరించి వదిలేసిన పోలీసులు

  • ఆగకుండా హారన్ మోగించుకుంటూ వెళ్లిన జై
  • హడలిపోయిన వాహనదారులు
  • క్షమాపణలు చెప్పి తప్పించుకున్న నటుడు

గతేడాది సెప్టెంబరులో మద్యం తాగి కారు నడుపుతూ అడయారు బ్రిడ్జి సమీపంలో గోడను ఢీకొట్టిన యువ నటుడు జై మరోమారు ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో అతడి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలలపాటు రద్దు చేశారు. అంతకముందు 2014లో కేకే నగర్ సమీపంలోని కాశీ థియేటర్ ప్రాంతంలో మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసుల వాహనాన్ని ఢీకొట్టాడు. తాజాగా మరోమారు చెన్నయ్ లో తన అనుచిత ప్రవర్తనతో పోలీసులకు చిక్కాడు.

మంగళవారం రాత్రి నుంగంబాక్కమ్ మెయిన్ రోడ్డులో ఆగకుండా పెద్ద శబ్దంతో హారన్ మోగించుకుంటూ వెళ్లాడు. దీంతో ఇతర ప్రయాణికులు హడలిపోయారు. పక్కనే ఆసుపత్రి ఉన్నప్పటికీ హారన్ మోతను ఆపకుండా సైరన్‌లా శబ్దం చేసుకుంటూ వెళ్లాడు. దీంతో పోలీసులు అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ధ్వని కాలుష్యంపై అతడికి అవగాహన కల్పించారు. జై క్షమాపణలు చెప్పడంతో హెచ్చరించి వదిలేశారు.

Tamilnadu
Actor
Jai
Kollywood
  • Loading...

More Telugu News